Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కార్లను కాదని... సైకిల్ పై సవారీ చేసిన సీఈవోలు

నిత్యం కారులో ప్రయాణిస్తూ... ఏసీ గదుల్లో పనిచేసే కంపెనీ సీఈవోలు హైదరాబాదు రోడ్లపై సైకిల్ పై సవారీ చేశారు. తమ కార్లను పక్కన పెట్టి... 10 కిలోమీటర్ల సైకిల్ యాత్రను 45 నిమిషాల్లో పూర్తిచేశారు. హైటెక్ సిటీలోని ఐటీ రహేజా మైండ్ స్పేస్ నుంచి ప్రారంభమైన 10కె సైకిల్ యాత్ర ఉత్సాహంగా సాగింది. ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన కల్పించడం కోసం 'ది అట్లాంటా ఫౌండేషన్' ఆధ్వర్యంలో ‘హైదరాబాద్ సీఈవో రైడ్’ పేరిట శనివారం ఉదయం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ యాత్రను ప్రారంభించారు. 200 మంది సీఈవోలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ రైడ్ మైండ్ స్పేస్ లోని వెస్టిన్ హోటల్ వద్ద ప్రారంభమైంది. సైబర్ టవర్స్, శిల్పారామం, సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్, డెల్, లెమన్ ట్రీల మీదుగా సైకిల్ సవారీ సాగింది. హైదరాబాదు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి సైకిల్ యాత్రలో పాల్గొన్నారు.

More Telugu News